ఏపీ ప్రభుత్వం…రుణమాఫి రద్దు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ సర్కార్ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వుల్ని రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన జీవో 38ని రద్దు చేస్తూ.. బుధవారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న.. 4,5 విడత రుణమాఫీ నిధులు రూ.7959.12 కోట్లు నిలిచిపోయాయట. దీంతో టీడీపీ సర్కార్ హయాంలో ఇచ్చిన హామీ పత్రాల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలుకు సిద్ధమయ్యింది.. అందుకే ఈ తాజా ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది. గత ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం ఇప్పుడు జీవో 99ని విడుదల చేసింది.

Videos