ఏపీ సచివాలయం పరీక్ష ఫలితాలు విడుదల

ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబరు 19) విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన 14 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అధికారిక వెబ్‌ సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 1,98,164 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో పురుషులు-1,31,327 మంది; స్త్రీలు-66835 మంది అభ్యర్థులు ఉన్నారు.

http://gramasachivalayam.ap.gov.in/  లో ఫలితాలు అందుబాటులో ఉంచారు.

Videos