హాట్ కపుల్‌ మళ్లీ కలుస్తున్నారా?

హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ మ‌న‌సు మార్చుకున్న‌ది. త‌న భ‌ర్త బ్రాడ్ పిట్‌కు ఇచ్చిన విడాకుల నోటీసును ఆమె వెన‌క్కి తీసుకోవాల‌నుకుంటున్న‌ది. తాను చేసిన పొర‌పాటును తెలుసుకున్న జోలీ ఇప్పుడు త‌న డైవ‌ర్స్‌కు బ్రేక్ వేయాల‌నుకుంటున్న‌ది. కోపంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని క్ష‌మాగుణంతో వెన‌క్కి తీసుకునేందుకు జోలీ రెడీ అయిన‌ట్లు టాక్‌. 12 ఏళ్ల బంధానికి ఈ హిట్ పెయిర్ ఇటీవ‌ల బ్రేక్ వేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తున్న చేసుకున్న‌ది జోలీ. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్నారు.

ఈ ఇద్ద‌రికీ ఆరుగురు పిల్ల‌లు ఉన్నారు. 2004లో ఓ ఫిల్మ్ షూటింగ్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డిన త‌ర్వాత.. అప్ప‌టి నుంచి వీళ్లు క‌లిసే ఉన్నారు. కానీ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే తాగుడుకు బానిస అయిన బ్రాడ్ పిట్ గ‌త ఏడాది జోలీతో విమానంలో గొడ‌వ‌ప‌డ్డాడు. దీంతో బ్రాడ్ పిట్ ప్ర‌వ‌ర్త‌నపై జోలీకి కోపం వ‌చ్చింది. ఆ ఆవేశంలోనే విడాకులు కావాలంటూ ఆమె బ్రాడ్‌కు లీగ‌ల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసు ఇచ్చిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌ళ్లీ జోలీ ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. విడాకుల కేసు కొద్దిగా కూడా ముందుకు సాగ‌లేదు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ కథనం ప్రచురించింది. బ్రాడ్ చేసిన తప్పులను క్షమించేసి తిరిగి అతనితో జీవించేందుకు ఇప్పటికే జోలీ రాయబారం మొదలు పెట్టిందని దాని సారాంశం. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్ పట్టించుకోవట్లేదన్న కారణం చెప్పినప్పటికీ, మరో యువతితో 52 ఏళ్ల బ్రాడ్ మరో యువతితో అఫైర్‌ మూలంగానే విడాకులు దారితీసినట్లు హాలీవుడ్లో ఓ టాక్.

Videos

Leave a Reply

Your email address will not be published.