ఇండియన్ టీంకు కుంబ్లే కొత్త రూల్స్…

ఏరికోరి తెచ్చుకున్న టీమిండియా కొత్త కోచ్ కుంబ్లే అప్పుడే తన మార్కును చూపిస్తున్నాడు. లేజీ క్రికెటర్లకు పనిష్మెంట్‌గా అనిల్ కుంబ్లే కొత్త రూల్ తీసుకొచ్చాడు. బస్సెక్కడానికి లేటైతే, ప్లేయర్ ఎవరైనా 50 డాలర్లు ఫైన్ కట్టాల్సిందేనని చెప్పేశాడు ఈ కోచ్. అంతేకాదు జట్టుతో పాటు ఉన్న సపోర్టింగ్ స్టాఫ్‌ కూడా ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేయాలో కూడా క్లారిటీ ఇచ్చాడట కుంబ్లే.

ప్లేయర్లకు ఎప్పుడు పడితే అప్పుడు మసాజ్ చేయడం కుదరదన్న కోచ్, ఓ పద్దతి ప్రకారమే అంతా జరగాలని ఆర్డరేశాడు. దీంతో ప్లేయర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇప్పుడు వెస్టిండీస్‌లో సుదీర్ఘమైన టూర్‌కొచ్చిన కుంబ్లే, తొలిరోజు నుంచే ప్లేయర్లను క్రమశిక్షణలో పెడుతున్నాడు. అందులో భాగంగానే తొలి మీటింగ్‌లోనే ఎవరైనా ఆలస్యంగా రావొచ్చు, కానీ ఫైన్ కట్టాల్సిందేనని ఆర్డరేశాడు. దీంతో ప్లేయర్లు ఇప్పుడు ఏ పనిచేయాలన్నా ముందుగా వాచ్ చూసుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *