అనితకు సినిమా అవకాశాలే లేవు.. అయినా భారీ సంపాదన.. ఎలా?

తెలుగులో ‘నువ్వునేను’ సినిమాతో అరంగేట్రం చేసింది హీరోయిన్‌ అనిత. అరంగేట్ర సినిమాయే సంచలన విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు అందుకుంది. తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌ వంటి యువహీరోలతో పలు సినిమాల్లో నటించింది. అయితే అనుకున్నంత విజయవంతం కాలేకపోవడంతో ఆ తర్వాత చాలా చిన్న సినిమాల్లో నటించింది.

తెలుగు వ్యక్తి, బిజినెస్‌ మ్యాన్‌ అయిన రోహిత్‌ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత, ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తోంది. అయినా అనిత ఆదాయం మాత్రం కళ్లు చెదిరే రేంజ్‌లో ఉంది. సినిమా అవకాశాలు లేకపోయినా సీరియల్స్‌లో నటిస్తూ భారీగా ఆర్జిస్తోంది అనిత. ప్రస్తుతం హిందీ సీరియళ్లలో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న నటి అనిత.

సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయినప్పటి నుంచి హిందీ సీరియల్స్‌ మీద దృష్టి పెట్టిన అనిత ప్రస్తుతం టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఒక్కో ఎపిసోడ్‌కు 50 వేల రూపాయలు పారితోషికంగా అందుకుంటోందట. ఒక్క ఎపిసోడ్‌తోనే అంత సంపాదిస్తోంటే.. సీరియళ్లంటే ఏళ్లకు ఏళ్లు సాగుతూనే ఉంటాయి. ఈ లెక్కన అనిత సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా ఆమె చేస్తున్నది ఒక్క సీరియల్‌ మాత్రమే కాదు. పలు సీరియల్స్‌లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published.