కృష్ణ నది ఉగ్రరూపం: హైఅలర్ట్ ప్రకటన

కృష్ణ, గుంటూరు జిల్లాలకు హైఅలర్ట్ ప్రకటన. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బ్యారేజీలోకి 7.76 లక్షల క్యూసెక్కుల  ప్రవాహం రావడంతో అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రికి బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రవాహం 5.66 లక్షల క్యూసెక్కులను దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వస్తున్న వరదతో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. కృష్ణా జిల్లా కంచికర్ల మండలంలోని నది పరీవాహక గ్రామాల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. గుంటూరు జిల్లా పెద్దమద్దూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ-అమరావతి మధ్య నాలుగో రోజు రాకపోకలు నిలిచిపోయాయి. 2009 తరువాత ఇంతగా భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ప్రకాశం బ్యారేజీపైన రెయిలింగ్‌ సరిగా లేకపోవడంతో అది ఏక్షణంలోనైనా పడిపోవచ్చునని పోలీసు అధికారులు చెబుతున్నారు. వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో బ్యారేజ్‌పై ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.

Videos

13 thoughts on “కృష్ణ నది ఉగ్రరూపం: హైఅలర్ట్ ప్రకటన

Leave a Reply

Your email address will not be published.