డే-1:టీడీపీ మహానాడు ప్రారంభం

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో మహానాడును ప్రారంభించారు. పార్టీ జెండను ఆవిష్కరించి, ఎన్టీఆర్కు నివాళులు అర్పించి మహానాడును ఆరంభించారు.   తిరుపతిలోని పురపాలక మైదానంలో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. అంతకు ముందు చంద్రబాబు మహానాడు ప్రాంగణంలో త్రీడీ షోతో పాటు, ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.

మహానాడు వేదిక పైన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం మాట్లాడారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీపై విభజన ఎఫెక్ట్, విభజన హామీలు, ఏపీలో ఇబ్బందులు తదితర ఎన్నో అంశాలపై మాట్లాడారు. మహానాడులో నేనూ ఓ కార్యకర్తనే అని చంద్రబాబు అన్నారు. నాడు ఎన్టీఆర్ సమాజం కోసం, కొత్త ఒరవడి కోసం ఆలోచించారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారన్నారు. అందుకే తెలుగుజాతికి మహానాడు పండుగ రోజు అన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ మహానాడు అన్నారు. ఎన్నో పార్టీలు వచ్చాయి… జెండాలు పెట్టారు… కానీ తర్వాత జెండాలు పీకేశారని.. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే పార్టీ ఒక్క టీడీపీయే అన్నారు చంద్రబాబు.

టీడీపీని త్యాగాలకు పెట్టింది పేరని చంద్రబాబు అభివర్ణించారు. పార్టీలో క్రమశిక్షణ కగిలిన కార్యకర్తగా తనను పరిచయం చేసుకున్న చంద్రబాబు… పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. సొంత కుటుంబం కంటే పార్టీని, పార్టీ కార్యకర్తలను చూసుకుంటున్నానని చెప్పారు చంద్రబాబు.

హైదరాబాదును ప్రపంచ పటంలో నిలిపింది కూడా టీడీపీనేనని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన పార్టీ కూడా టీడీపీనే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వంటగ్యాస్‌ ఇస్తాం.. పేదవారు కూడా గ్యాస్‌ పొయ్యిపై వంట చేసుకోవచ్చు అన్నారు చంద్రబాబు… యువతకు ఉద్యోగాల కోసం విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులు తెస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలంగా ఉందిని పేర్కొన్నారు చంద్రబాబు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *