అంబేద్కర్ జయంతి సందర్భంగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన AP ప్రభుత్వం

పేదవారి జీవితాల్లో వెలుగు నింపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.కృష్ణాజిల్లా జక్కంపూడిలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించనున్నారు. జక్కంపూడిలో 10వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చంద్రబాబు మాట్లాడుతూ.. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణానికి రూ.42వేల కోట్లు మంజూరు చేస్తే .. అందులో కేవలం 12వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని తెలిపారు. ఆర్థిక అసమాతనలు తగ్గించేందుకు అంబేడ్కర్ కృషి ప్రశంసనీయమని కొనియడారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 6లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.16వేల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *