ఏపీలో అత్యవసర సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తన ప్రయాణాన్ని ముగించుకొని శనివారం తెల్లవారు జమునా హైదరబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఆ తర్వాత అక్కడ నుండి వేరే విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడికి డిప్యూటీ సిఎం నారాయణమూర్తి వచ్చి స్వాగతం పలికారు. నేరుగా అమెరికా నుండి అమరవతికి చేరిన జగన్ ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అందులో తన అమెరికా పర్యటన గురించి, పోలవరం పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు గురించి, ఆయన లేనప్పుడు రాష్ట్రంలో జరిగిన పరిణామాల గురించి, రాష్ట్రంలో వచ్చిన వరదలు గురించి చర్చించబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో నవయుగ సంస్థను తప్పించడంపై హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టు తెలిసింది.

Videos