అర్హత ఉన్న ప్రతివారికి ఉగాదినాటికి ఇంటి స్థలం: జగన్

సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలన్నారు. భూముల రీసర్వే, కౌలుదారుల రక్షణ చట్టంపై భూ యజమానులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా ఉందని,ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగులుగుతామని అధికారులు వివరించారు.

Videos

30 thoughts on “అర్హత ఉన్న ప్రతివారికి ఉగాదినాటికి ఇంటి స్థలం: జగన్

Leave a Reply

Your email address will not be published.