ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూసిన ఏపీ మంత్రులు… సుప్రీంకోర్టు తీర్పు తర్వాత… ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను మాత్రమే విడుదల చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు బాగా ఆలస్యమైంది. తీర్పులో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుప్రీం తీర్పుపై చర్చించి… మెడిసిన్‌ ఫలితాలను ఆపి… కేవలం ఇంజినీరింగ్‌ ఫలితాలను మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి గంటా.

ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ టాప్‌ 10లో నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కాగా… ఒకరు మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థి ఉన్నారు. ఇక ర్యాంక్‌ల విషయానికి వస్తే… మొదటి ర్యాంక్‌ సత్తి వంశీకృష్ణారెడ్డి, రెండో ర్యాంక్‌ చప్పిడి లక్ష్మీనారాయణ, మూడో ర్యాంక్‌ కొండా విఘ్నేష్‌రెడ్డి, నాలుగో ర్యాంక్‌ ప్రశాంత్‌రెడ్డి, ఐదో ర్యాంక్‌ గంటా గౌతమ్‌, ఆరో ర్యాంక్‌ దిగుమర్తి చేతన్‌ సాయి, ఏడో ర్యాంక్‌ తాళ్లూరి సాయితేజ, ఏడో ర్యాంక్‌ అజయ్‌ జార్జ్‌, తొమ్మిదో ర్యాంక్‌ సాయి దినేష్‌, పదో ర్యాంక్‌ నంబూరి జయకృష్ణసాయి సాధించారు.

ఈ నెల 27న ఇంజినీరింగ్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జూన్‌ 6వ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, 22న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 27 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభంకానున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *