విద్యార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల రాయితీ బస్‌ పాస్‌ పరిధి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటోంది. దీనితో రాయితీ బస్‌ పాస్‌లకు అర్హత కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్న 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఆర్టీసీ అందించే అన్ని రకాల బస్‌ పాస్‌లకు ప్రభుత్వం సంస్థకు వంద శాతం నిధుల్ని రీయింబర్స్‌ చేస్తుంది. ఈ బస్‌ పాస్‌లకుగాను ఏటా రూ.290 కోట్ల మేర ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published.