ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించింది. కౌంటింగ్ ప్రారంభమయిన దగ్గరనుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. అయితే కడపలో తొలి రౌండ్‌లో వైసీపీ ఆధిక్యం కనబరిచినప్పటికీ విజయం మాత్రం టీడీపీనే వరించింది. ఈ విజయంతో రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
కడపలో..
ప్రతీ క్షణం వెన్నులో వణుకు పుట్టించిన కడప ఎమ్మెల్సీ కౌంటింగ్ అంతే ఉత్కంఠ రేపుతూ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి విజయం కట్టబెట్టింది. వైసీపీ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డిపై 33ఓట్ల మెజారిటీతో రవి విజయం సొంతం చేసుకున్నారు. కడప వైసీపీ అధినేత జగన్ సొంత గడ్డ కావడంతో అక్కడ గెలుపు టీడీపీకి అంతులేని ఆనందాన్నిచ్చింది. వైసీపీకి అంతే విషాదాన్ని మిగిల్చింది. తమకు మేలు చేస్తుందనుకున్న క్రాస్ ఓటింగ్ మంత్రం ఫలించకపోవడం వైసీపీని మరింత విషాదంలో ముంచెత్తింది.
నెల్లూరులో…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. 87 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై నారాయణ రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో జిల్లా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
కర్నూలులో…
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు. 56 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై శిల్పా చక్రపాణి విజయం సాధించారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *