ఏపీ రవాణా శాఖ అధికారులపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

ఏపీ రవాణా శాఖ అధికారులపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. రవాణాశాఖ మొత్తం అవినీతిమయంగా మారిందంటూ ఘాటుగా విమర్శించారు. ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్‌ప్రదేశ్‌ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ స్పందిస్తే రాష్ట్రంలో అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు.

తప్పులు చేయడం సహజమన్న కేశినేని నాని బాధ్యతగా ఉన్న వారు చెబితే మార్చుకోవాలన్నారు. కొన్ని బస్సులు డెలివరీ అవకముందే రిజిస్టర్ అయ్యాయని ఫిజికల్ వెరిఫికేషన్‌ కూడా చేయలేదన్నారు.  అధికారులు కళ్లుమూసుకుని అధికారులు పనిచేస్తున్నారన్న నాని అధికారుల తప్పులు ప్రజలకు తెలియజేయడానికే వ్యాపారం మానేశానన్నారు.

Videos

1,079 thoughts on “ఏపీ రవాణా శాఖ అధికారులపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు