5రోజుల్లోనే పవన్ రికార్డు స్మాష్: అర్జున్ రెడ్డి ప్రభావం మామూలుగా లేదుగా

విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తన రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

రిలీజ్ ముందు యాంటీ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన ఈ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులతో సంచలనంగా మారింది. చూస్తుంటే ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుండగా టోటల్ రన్ లో సినిమా 30 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.యూఎస్ లో ఈ సినిమాకు ఎలాంటి కత్తెరలు పడలేదు. ఇక ఇలాంటి సినిమాలకు యూఎస్ లో ఈ రేంజ్ లో సక్సెస్ అవడం గొప్ప విషయం.

బిజినెస్ మ్యాన్ యూఎస్ లో 7 లక్షల డాలర్లు మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ యూఎస్ లో 7 లక్షల డాలర్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి మూడు రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. విజయ్ నటించిన పెళ్లిచూపులు సినిమా కూడా యూఎస్ లో 50 రోజులు ఆడించారంటే ఇక అక్కడ విజయ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఓవర్సీస్‌లో అర్జున్‌రెడ్డి అయితే విడుదలయి వారం రోజులు కూడా కాకముందే ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అర్జున్‌రెడ్డి సినిమా విడుదలయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసింది.

మొత్తం 89 థియేటర్లో అమెరికాలో విడుదలయిన ఈ సినిమా కేవలం అయిదు రోజుల్లోనే.. అంటే మంగళవారం నాటికి 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను కలెక్ట్ చేసింది. ఇంత తక్కువ థియేటర్లలో విడుదలయినా అతి తక్కువ సమయంలోనే ఒక మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకుముందు విడుదలయిన ఏ సినిమాలు కూడా ఈ అరుదైన ఫీట్‌ను సాధించలేకపోయాయి.

Videos

33 thoughts on “5రోజుల్లోనే పవన్ రికార్డు స్మాష్: అర్జున్ రెడ్డి ప్రభావం మామూలుగా లేదుగా

Leave a Reply

Your email address will not be published.