రేపటి నుంచే ఆసియా కప్‌-సన్నద్ధతకు చివరి చాన్స్

క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఆసియాకప్‌ ముస్తాబైంది. టీ-20 వరల్డ్‌క్‌పనకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దానికి సన్నాహకం అన్నట్టుగా ధనాధన్‌ షాట్లతో ఉర్రూతలూగించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. 1984లో వన్డే ఫార్మాట్‌గా మొదలై రెండేళ్లకోసారి ఆసియాతోపాటు యావత ప్రపంచానికి వినోదాన్ని పంచుతున్న ఈ మెగా టోర్నీ తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో గిలిగింతలు పెట్టనుంది. బంగ్లాదేశ్‌ వేదికగా జరిగే ఈ టోర్నీ విశేషాలపై ఓ లుక్కేద్దామా..!

మొన్న ఆస్ట్రేలియా వెళ్లి టీ20ల్లో సత్తా చాటి వచ్చాం. 20 ఓవర్ల ఆట కోసం నిన్న మన దేశానికి వచ్చిన లంకనూ ఓడించి పంపించేశాం. అలా పొట్టికప్పు కోసం ఆత్మవిశ్వాసాన్ని బాగానే ప్రోది చేసుకున్నాం. ఆ ప్రపంచ సమరానికి ముందు ఇప్పుడు మనకు మరో వామప్. ఆసియా టీ20 కప్ ప్రారంభమయ్యేది రేపే. చలో దునియాను గెలిచేందుకు ఆసియా కప్‌తో రెడీ అవుదాం!!

క్రికెట్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదు దేశాలు.. 12 రోజులపాటు.. టైటిల్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బుధవారం మొదలయ్యే ఆసి యా కప్‌లో టైటిల్‌ కోసం అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారిగా టీ-20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ ఆసియా కప్‌లో ఐదుసార్లు చాంపియన్‌ భారత మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, పాకిస్థాన్‌ గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తు న్న బంగ్లాదేశ్‌తోపాటు యుఏఈ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌, భారత జట్ల మధ్య బుధవారం జరిగే పోరుతో ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం కానుంది. అలాగే ఈ నెల 27న భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగే దాయాదుల సమరం కూడా ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ కానుంది.

 

ఆసియా కప్ షెడ్యూల్
ఫిబ్రవరి 24 భారత్ X బంగ్లాదేశ్
ఫిబ్రవరి 25 శ్రీలంక X యూఏఈ
ఫిబ్రవరి 26 బంగ్లాదేశ్ X యూఏఈ
ఫిబ్రవరి 27 భారత్ X పాకిస్థాన్
ఫిబ్రవరి 28 బంగ్లాదేశ్ X శ్రీలంక
మార్చి 1 భారత్ X శ్రీలంక
మార్చి 2 పాకిస్థాన్ X బంగ్లాదేశ్
మార్చి 3 భారత్ X యూఏఈ
మార్చి 4 పాకిస్థాన్ X శ్రీలంక
మార్చి 6 ఫైనల్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *