25 వసంతాల ‘అసెంబ్లీరౌడీ’

‘ఇవాళ ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇంకో పార్టీలోకి వెళ్లిపోవడం వంటి నీచ నికృష్టమైన విషయాలను అప్పట్లోనే ‘అసెంబ్లీ రౌడీ’లో చూపించాం’’ అన్నారు మోహన్‌బాబు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలై శనివారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం దర్శకుడు బి. గోపాల్‌, రచయిత పరుచూరి గోపాలకృష్ణతో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.

‘‘ఇది తమిళంలో పి. వాసు డైరెక్ట్‌ చేయగా హిట్టయిన ‘వేలై కిడైచుడుచ్చు’ సినిమాకి రీమేక్‌. అప్పుడు గుర్రంలా పరుగులు పెడుతున్న బి. గోపాల్‌ను డైరెక్ట్‌ చెయ్యమంటే సరేనన్నాడు. రెండు రోజుల్లో పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌ రాసేశారు. హీరోయిన్ గా అప్పుడే బొబ్బిలిరాజా చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతిని తీసుకోవాలనుకున్నాం. అయితే ఇండస్ట్రీలో మనం బాగుంటే చూడలేని చాలా మంది ఆ అమ్మాయిని హీరోయిన్ గా ఎందుకు తీసుకుంటారు. అని కూడా అన్నవారు ఉన్నారు. అలాగే నాకు, బి.గోపాల్ మధ్య అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వీటిని కాదని సినిమా చేశాం.. అద్భుతంగా చేసింది.

నా తండ్రి పాత్రకు మొదట రావు గోపాలరావును అనుకున్నాం. ఆయన షూటింగ్‌కు ఏడింటికి కాకుండా తొమ్మిదిన్నరకు వస్తానంటే, సున్నితంగా వద్దని చెప్పి జగ్గయ్యగార్ని తీసుకున్నాం.. ‘స్వర్గం నరకం’లో నా హీరోయిన్‌గా చేసిన అన్నపూర్ణ ఇందులో నా తల్లి పాత్రను చేశారు. కె.వి. మహదేవన్ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ‘అసెంబ్లీ రౌడీ’ని 41 రోజుల్లో తీశాం. 25 వారాలు ఆడింది. తిరుపతి దగ్గర తిరుచానూర్‌లో క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ ఐదుగురు కాంగ్రెస్ వాళ్లు వచ్చి గొడవ చేసి, మాకు భద్రతగా ఉన్న ఓ కానిస్టేబుల్‌ను కొట్టబోతే, చేతిలో ఉన్న కత్తితో తరిమాను. వాళ్లను పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాం. సినిమా రిలీజయ్యాక ‘అసెంబ్లీ రౌడీ’ అనే టైటిల్‌ పెట్టానని అసెంబ్లీలో మూడు రోజుల పాటు గొడవ. సినిమాని నిషేధించాలన్నారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘’అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్ బాబు గారు ఓ కొడుకుగా, ప్రేమికుడుగా, బాధ్యత గల యువకుడుగా, ఎమ్మెల్యేగా ఎన్ని వెర్షన్స్ లో డైలాగ్స్ చెప్పారో నాకు తెలుసు. షూటింగ్ టైంలో ఆయన నటనను అలా చూస్తూ ఉండిపోయాం. పరుచూరి బ్రదర్స్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కుదిరింది’’ అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘’సినిమా డైలాగ్స్ ను ఒకటిన్నర రోజులోనే పూర్తి చేశాం. తమిళం కంటే తెలుగులో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఆ డైలాగ్స్ మోహన్ బాబు చెప్పిన తీరు ఇప్పటికీ హైలైట్ గా నిలిచిపోయింది. సినిమా విడుదలైన తర్వాత తన భార్యబిడ్డల సహా మా ఇంటికి వచ్చి ఇకపై నిన్ను అగ్రజ అని పిలుస్తానని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే పిలుస్తున్నారు. ఈ సినిమా మా అందరికీ మరచిపోలేని జర్నీ’’ అన్నారు.

అయితే అన్నగారు నందమూరి తారక రామారావుగారు అండగా నిలబడ్డారు. అప్పటి స్పీకర్ ధర్మారావుగారు సినిమా చూసి సినిమా చాలా బావుందని అన్నారు. అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ చిత్రం 25 వారాల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇందులో హీరోగా విష్ణు నటిస్తారు’’ అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.