ఎన్‌టి‌ఆర్ నెక్స్ట్ మూవీ ఇతనితోనా?

కోలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా రాణిస్తున్న యువ దర్శకుడు అట్లీ. రాజారాణి చిత్రంలో దర్శకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన ఈయన టాలీవుడ్‌ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్  హీరోగా చిత్రం చేయనున్నారనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అయితే జూనియర్‌ ఎన్టీఆర్ కు తమిళంలో నటించాలన్న ఆశ చాలా కాలంగా ఉంది. అయితే ఆయన ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా ఆయనతో దర్శకుడు అట్లీ చిత్రం చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం జూనియర్‌  ఎన్టీఆర్  రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. అట్లీ బిగిల్‌ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదల తరువాతనే ఆయన తన తాజా చిత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Videos