కంగారూల సంచలనం, టీ20ల్లో ప్రపంచ రికార్డు

పొట్టి క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు సంచలనం నమోదుచేసింది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20 కంగారూలు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లుకు 263 పరుగుల భారీస్కోరు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి జట్టుగా ఆసీస్ రికార్డుకెక్కింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (65 బంతుల్లో 145 నాటౌట్; 14 ఫోర్లు, 9 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీకి తోడు, హెడ్ (45), ఖవాజ (36), వార్నర్ (28)లు రాణించడంతో లంకకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తర్వాత లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 178 పరుగులకే పరిమితమై 85 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. లంక జట్టులో చండిమల్ (58), కపుగెదెరా (43) మినహా మిగతా వారు నిరాశపర్చారు. స్టార్క్, బోలాండ్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో వార్నర్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.

సంక్షిప్తస్కోర్లు:
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 263/3 (మాక్స్‌వెల్ 145 నాటౌట్, హెడ్ 45, పతిరన 1ఉ45);
శ్రీలంక: 20 ఓవర్లలో 178/7 (చందీమల్ 58, కపుగెదెర 43, స్టార్క్ 3/26, బొలాండ్ 3/26).

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *