మోడీ బాటలో ఆస్ట్రేలియా… పెద్ద నోటు రద్దు ?

నల్లధనాన్ని నిర్మూలించేందుకు భారత్ లో ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి. మరి కొన్ని దేశాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వెనిజువెలాలో అక్కడి పెద్ద నోటు అయిన 100 బొలివర్ నోటును రద్దు చేశారు. ఇప్పుడు ఇదే దారిలో మరో దేశం పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేమీ చిన్నా చితకా దేశం కాదు. అత్యంత అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా.

తమ దేశంలో పెద్ద నోటు అయిన 100 డాలర్ల నోటును రద్దు చేసే దిశంగా అక్కడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా రెవెవన్యూ ఆర్థిక సర్వీసుల శాఖ మంత్రి కెల్లీ ఓ డ్వెయిర్ తెలిపారు. నల్లధనాన్ని నియంత్రించే క్రమంలో 100 డాలర్ల నోటు రద్దు, ఇతర నగదు లావాదేవీలను సమీక్షిస్తామని ఆయన చెప్పారు. రానున్న సోమవారం రోజు ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, నరేంద్ర మోడీ నోట్ల రద్దును చివరి నిమిషంలో ప్రకటిస్తే… ఆస్ట్రేలియా మాత్రం ముందుగానే సూచనప్రాయంగా తెలిపింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *