అవికను వేధిస్తున్న యువ హీరో!

అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది చిన్నారి పెళ్లి కూతురు అవికాగోర్. అందరికీ అవికా గోర్ కన్నా.. ఆనందిగానే సుపరిచతం. అయితే.. ఆమెకు టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో నుంచి వేధింపులు తప్పడం లేదట. ఆమెకు వాట్సాప్‌లో ఆ యంగ్ హీరో.. అశ్లీల పదాలతో కూడిన అసభ్య సందేశాలను పంపుతున్నాడట. తొలుత ఆ మెసేజ్‌లు పంపేది ఎవరో తెలియదట అవికకు. ఎవరో ఆకతాయిలు పంపుతున్న మెసేజ్‌లు అని అనుకుందట. ఆ తర్వాత అసభ్య సందేశాలను పంపుతున్నది ఓ యంగ్ హీరో అని తెలుసుకుని ఆమె షాక్ అయిందట. వెంటనే ఆ విషయాన్ని నిఖిల్, రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బపటేల్ వంటి తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుందట. ఈ ఘటనతో తెలుగు సినిమాల్లో నటించాలంటేనే విరక్తి కలుగుతోందని వారి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసిందట.

ఇక్కడి యువ హీరోలు తమ తోటి హీరోయిన్లతో ప్రవర్తించే తీరు ఏ మాత్రం బాగుండడం లేదని అందట. ఇక, తనకు వచ్చిన అసభ్య మెసేజ్‌లన్నింటినీ తన వాట్సాప్ నుంచి తీసేసిందట. మరి, తనకు మెసేజ్‌లు పంపుతున్న ఆ యంగ్ హీరో ఎవరన్నది ప్రస్తుతం అన్వేషిస్తున్నారట. కాగా, అంతకుముందు రాధికా ఆప్టే కూడా ఇలాంటి కామెంట్లే చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఇప్పుడు అవిక కూడా చేరిపోయింది.

Videos

Leave a Reply

Your email address will not be published.