‘మజ్ను’లో బాహుబలి టీం అంతా..?

‘మజ్ను’ సినిమాలో రాజమౌళి కనిపిస్తాడన్న సంగతి పాతదే. ఐతే జక్కన్నతో పాటు ‘బాహుబలి’ టీం అంతా కూడా ‘మజ్ను’లో దర్శనమిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నాని ఈ సినిమాలో రాజమౌళికి అసిస్టెంటుగా కనిపించబోతుండగా.. అతను పని చేసే సినిమా ‘బాహుబలి’యే కావడం విశేషం. ‘మజ్ను’ ప్రమోషన్లలో భాగంగా నాని చెప్పిన ముచ్చట్లు వింటుంటే.. సినిమాలో రాజమౌళితో పాటు మరికొందరు ‘బాహుబలి’ యూనిట్ సభ్యులు కనిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మజ్నులో తాను ఆదిత్య అనే అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తానని.. ‘బాహుబలి’ సినిమాకి రాజమౌళి గారి దగ్గర పనిచేస్తుంటానని చెప్పిన నాని.. ఈ సినిమాలో రాజమౌళి ఒక్కడే కనిపిస్తాడా? ‘బాహుబలి’ బృందం కూడా కనిపిస్తుందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని అన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. ‘బాహుబలి’ షూటింగుకి సంబంధించిన దృశ్యాలేమైనా చూపిస్తారేమో అని సందేహం కలుగుతోంది.

గతంలో తాను కూడా సహాయ దర్శకుడిగా పని చేయడంతో ఈ సినిమాలో ఆ పాత్ర పోషించడం తేలికైందని.. తనకు అప్పటి రోజులు గుర్తొచ్చాయని నాని చెప్పాడు. ‘మజ్ను’ సినిమా చూశాక ‘మజ్ను’ అనే మాటను మరో కోణంలో ప్రేక్షకులు వాడతారని.. నిజమైన ప్రేమే కరవైన ఈ రోజుల్లో మళ్లీ ఓ స్వచ్ఛమైన.. నిజాయతీతో కూడిన ఓ ప్రేమకథని తెరపై చూపిస్తున్నాని నాని అన్నాడు. తాను ప్రస్తుతం ‘పక్కా లోకల్’ సినిమా చేస్తున్నానని.. దీని తర్వాత డి.వి.వి.దానయ్య నిర్మించే చిత్రం ఉంటుందని నాని వెల్లడించాడు.

Videos

10 thoughts on “‘మజ్ను’లో బాహుబలి టీం అంతా..?

Leave a Reply

Your email address will not be published.