30 ఏళ్లు పీకిందేమీ లేదు ‘బాబు బంగారం’ ఆడియో పంక్షన్ విశేషాలు

తరం మారినప్పుడల్లా పాత నీరు పోయి కొత్త నీరు వస్తూంటుంది. అలాగే సిని పరిశ్రమలోనూ జనరేషన్స్ మారినప్పుడల్లా వారసుల ఎంట్రీ జరుగుతూంటుంది. ఆ కోవలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య వచ్చేసారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా తన కుమారుడు అర్జున్ ని దింపే పనిలో ఉన్నారు. అయితే అందుకు టైమ్ ఉంది. అప్పటివరకూ వెంకటేష్ నటిస్తూనే ఉంటారట.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ…” మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా” అని వెంకటేశ్ అన్నారు. ఈ 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ‘మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్‌పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా’ అని మారుతిని అడిగా అని ఆనందంగా అన్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. నయనతార హీరోయిన్. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ఈ కార్యక్రమానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడీని ఆవిష్కరించారు. డి.సురేష్‌బాబు అందుకొన్నారు.‘‘ఓ నిర్మాత తనయుడు హీరోగా ముఫ్ఫై ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. అది వెంకటేష్‌కే సాధ్యమైంది” అన్నారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు. వెంకటేష్‌ని ‘బాబు బంగారం’ అని ఇవాళ అందరూ చెబుతున్నారు. ముఫ్పై ఏళ్ల క్రితం ఆ విషయం నేనే చెప్పా. ఏ ఒక్క నిర్మాతనీ ఇబ్బంది పెట్టకుండా మూడు దశాబ్దాల ప్రయాణం సాగించాడు వెంకటేష్‌. తెరపై వెంకటేష్‌ వేరు.. తెర వెనుక వేరు. ఆయన నిర్మాతల కథానాయకుడు. నిర్మాత కష్టసుఖాలు తెలిసిన నిజమైన హీరో అని చెప్పారు.‘బ్రహ్మపుత్రుడు’ చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంటే సౌండ్‌ బాక్స్‌ భుజంపై మోసుకొంటూ కొండెక్కాడు. అంత క్రమశిక్షణ, వృత్తిపై శ్రద్ధ ఉన్న నటుడు. కథాబలం ఉన్న చిత్రాల్ని ఎంచుకొన్నాడు. అందుకే ఎక్కువ విజయాలు దక్కాయి అని దాసరి అన్నారు.

‘వి అంటే విక్టరీ.. అనే డైలాగ్‌ ‘కలియుగ పాండవులు’లో వెంకటేష్‌తో చెప్పించాం. దాన్ని వెంకటేష్‌ నిజం చేశాడు.‘బాబు బంగారం’ అంతటి ఘన విజయాన్ని సాధించాలి”అన్నారు.జనరల్‌గా హీరో కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు, నిర్మాత కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు. నెగటివ్ క్యారెక్టర్‌తో మొదలు పెట్టి దాన్ని పాజిటివ్‌గా చూపించి ‘కలియుగ పాండవులు’ తీశా అన్నారు రాఘవేంద్రరావు.

ముఫ్పై ఏళ్లు ఎలా గడిచిపోయాయో నాకే అర్థం కావడం లేదు. వేదికలపై పెద్దగా మాట్లాడడం రాదు. ఏం చేసినా తెరపైనే. కేవలం అభిమానుల ప్రేమ కోసం, వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఇలాంటి వేడుకలకు వస్తుంటా అన్నారు.తొలి సినిమా నుంచీ నన్ను ప్రోత్సహిస్తున్నవాళ్లందరికీ నా కృతజ్ఞతలు. సినిమాలు తగ్గించేద్దాం అనుకొంటున్న సమయంలో మారుతి నాతో ఈ సినిమా తీశాడు. తెరపై నన్ను నేను చూసుకొంటుంటే పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిపోయాననిపించింది అన్నారు సంబరంగా వెంకటేష్.ఈ సినిమా తరవాత నన్ను పెళ్లికాని ప్రసాద్‌ అని పిలుస్తారో.. ‘బాబు బంగారం’ అని పిలుస్తారో చూడాలి అని చెప్పారు వెంకటేష్.

చిన్నప్పటి నుంచీ వెంకటేష్‌గారి సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో పనిచేయడం దర్శకులందరికీ ఓ కల. వెంకటేష్‌ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ సినిమా తీశా. నయనతార పాత్రకు ప్రాణం పోశారు. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అని మారుతి చెప్పారు.

Videos

29 thoughts on “30 ఏళ్లు పీకిందేమీ లేదు ‘బాబు బంగారం’ ఆడియో పంక్షన్ విశేషాలు

Leave a Reply

Your email address will not be published.