బాలయ్యకి ఇది ఘోర అవమానమేనా?

నందమూరి ఫాన్స్ నిన్నటి నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ మీద ఆగ్రహం తో ఉన్నారు. కారణం సై రా నరసింహరెడ్డి లాంచ్ కావడం. దానికి దీనికి లింక్ ఏంటి అనుకుంటున్నారా. చాలా ఉంది. గతంలో బాలయ్య తన 99వ సినిమా చేస్తున్నప్పుడు వందో సినిమాగా కృష్ణవంశీ తో రైతు అనే సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కూడా సిద్ధం అయ్యింది. కాని అందులో చాలా కీలకమైన ఒక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ కావాలి అనుకున్నారు.

అనుకోవడం ఆలస్యం రామ్ గోపాల్ వర్మ సహాయంతో సర్కార్ 3 షూటింగ్ లో ఆయనను కలిసి ఒప్పించే ప్రయత్నం చేసారు. కాని బిగ్ బి మాత్రం తాను ఇప్పుడు బిజీ గా ఉండటం వల్ల చేయలేను అని చెప్పి  సున్నితంగా వదులుకున్నారు. వర్మ రికమండ్ చేసినా లాభం లేకపోయింది. దాంతో ఏకంగా ఆ సినిమానే కేన్సిల్ చేసుకున్నాడు బాలయ్య. ఆ పాత్రకు అమితాబ్ తప్ప ఎవరూ సరితూగరు అని ఆయన అభిప్రాయం.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 మూవీ సైరా నరసింహారెడ్డి సినిమాలో బిగ్ బి ఉంటున్నాడు అనే విషయం తమ అఫీషియల్ టీజర్ లో చిరు టీం ఫోటోతో సహా చూపించి ఖరారు చేసింది. ఏడాది దాకా ఖాళీ లేను అని  అప్పుడు చెప్పిన బిగ్ బి చిరంజీవి సినిమా అనగానే డేట్స్ కుదిరాయా అని అడుగుతున్నారు బాలయ్య ఫాన్స్.

కాని రైతు సినిమాలో గవర్నర్ పాత్ర కాబట్టే అమితాబ్ వద్దు అనుకున్నారని, కాని సై రా మూవీ లో పవర్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ రోల్ ఇవ్వడం అందులోనూ తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన చిరంజీవి మొదటిసారి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం కావడం లాంటి కారణాల వల్లే చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఏదైనా బాలకృష్ణ మొదట అడిగినప్పుడు కాదని ఇప్పుడు చిరు సినిమాకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల బాలయ్యకు జరిగిన అవమానంగా ఫీల్ అవుతున్నారు ఫాన్స్.

Videos

69 thoughts on “బాలయ్యకి ఇది ఘోర అవమానమేనా?

Leave a Reply

Your email address will not be published.