రోమాలు నిక్కబొడిచేలా… బాహుబలి 2 ప్రభాస్ పోస్టర్

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ లో రెండోవ భాగం బాహుబలి: ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేయగా.. విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉంది.

శివుడు రుద్రతాండవం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బాహుబలిః ది కంక్లూజన్ సినిమా కోసం ప్రభాస్ కూడా అలాంటి ఫీట్లనే చేసినట్లున్నాడు. అదిగో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ కండలవీరుడు కొత్త పోస్టర్ ఒకటొచ్చింది. అది చూస్తేనే రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో ఉన్న మాట వాస్తవం.

Prabhas-Baahubali-2
Prabhas-Baahubali-2

శివరాత్రి సందర్బంగా బాహుబలి 2 టీజర్ ఏదైనా రిలీజ్ చేస్తారా అనుకుంటే.. ప్రస్తుతానికి మరో కొత్త పోస్టర్ తో సరిపెట్టేశాడు రాజమౌళి. ఇప్పటివరకు ఈ 2వ పార్టుకు సంబంధించి మూడు పోస్టర్లు రాగా.. మూడూ కూడాను ఏదో విధంగా కాంట్రోవర్సీలతో కాలం గడిపేశాయి. ఒక పోస్టర్లో కామిక్ నేచర్ ఉందని.. ఇంకో దాంట్లో బాణం తప్పుగా ఉందని.. నెటిజన్లు పిచ్చెత్తించారు. అందుకే ఇప్పుడు అనేక జాగ్రత్తలతో రాజమౌళి బాహుబలి కొత్త పోస్టర్ ను రూపొందించినట్లున్నాడు. హీరోయిజమ్ ఉట్టిపడేలా ఇందులో ఏనుగు తొండంపైనుండి సింహాసనం అధీష్టిస్తున్న యోధుడిలా బాహుబలి కొత్త పోస్టర్ ను తీర్చిదిద్ది రిలీజ్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *