బాహుబలికి … నిజంగా ఇది ఘోర అవమానమే ?

‘బాహుబలి’ … తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక వసూళ్ళలో కొత్త చరిత్ర క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు ఘోర అవమానం జరిగిందని అంటున్నారు జనాలు ? దానికి కారణం .. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2016 ఏడాదికి గాను నామినేషన్స్ జరిగాయి. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శనకోసం 22 సినిమాలు ఎంపిక చేసారు, ఇక బాలీవుడ్ నుండి ”సుల్తాన్” , ”బాజీరావు మస్తానీ”, ”ఎయిర్ లిఫ్ట్” చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే తెలుగు సినిమాల్లో మాత్రం ”బాహుబలి” లిస్ట్ లో లేకపోవడం అందరికి షాక్ ఇస్తుంది. ఎంతో గొప్ప పేరుతెచ్చుకున్న ‘బాహుబలి’ సినిమాను ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక చేయకపోవడంతో నిజంగా ‘బాహుబలి’ సినిమాను అవమానించారని అంటున్నారు సినీ జనాలు. దాంతో పాటు ఈ సినిమా అవార్డుల ఫెస్టివల్ లో ఒక్క తెలుగు సినిమా కూడా ప్రదర్శనకు నోచుకోకపోవడం విశేషం. మొత్తానికి ఇలా ఫిలిం ఫెస్టివల్ లో కూడా తెలుగు సినిమాకు అన్యాయం జరిగింది అనడానికి నిజంగా ఇది పెద్ద ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందిన ‘బాహుబలి’ సినిమాను కమిటీ ఎందుకు ఎంపిక చేయలేదనే వాదన మరో వైపు వినిపిస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *