బాలయ్య సింప్లిసిటీకి హ్యాట్సాఫ్

నేటి కథానాయకుల గురించి తెలియందేముంది?  ఒకట్రెండు హిట్లు లభించగానే తమని తాము ఆకాశమంత ఎత్తులో ఊహించుకుంటుంటారు. తాము ఏదడిగితే అది సమకూర్చాల్సిందే అని నిర్మాతల్ని డిమాండ్ చేస్తుంటారు.  ఆలోపు బాబుగారూ.. బాబుగారూ… అంటూ చుట్టూ ఓ కోటరీ కూడా చేరిపోతుంటుంది. కార్ వ్యాన్లూ… స్పెషల్ అరేంజ్ మెంట్లు అంటూ  ఇలా బోలెడంత హంగామా చేస్తుంటారు. గొడుగు కింద నుంచి బయటికి రారంటే నమ్మండి. తాము  కూర్చున్న చోటకే సమస్థం  సమకూరాలంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ  కొద్దిమంది కథానాయకులు సింప్లిసిటీని చాటుతుంటారు. అందరిలో మేమూ అందరిలాగే మేమూ అంటూ కలిసిపోతుంటారు. ఆ తరహా కథానాయకుల్లో బాలకృష్ణ ఒకరు.

నలభయ్యేళ్ల ప్రయాణం ఆయనది. ఒక స్టార్ కథానాయకుడిగా గొప్ప విజయాలెన్నో సొంతం చేసుకొన్నారు. కానీ ఆ గర్వం మాత్రం తలకెక్కించుకోలేదు. ఇప్పటికీ ఆయన జనం మధ్య షూటింగ్ చేయడానికే ఇష్టపడుతుంటాడు. ఎండ లేనప్పుడు గొడుగు పట్టాల్సిన అవసరం ఎందుకు? అంటుంటారు. సెట్లోనూ అందరితో కలివిడిగా మెలుగుతుంటారు. తనకో రూలు ఇతరా టీమ్ కి ఓ రూలంటూ వుండకూడదు అని చెబుతుంటారు. అంత సింప్లిసిటీ ఆయనది. తాజాగా ఆ విషయాన్ని మరోసారి చాటుకున్నారు. మొరాకోలో ప్రస్తుతం బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ జరుగుతోంది. అక్కడ యూనిట్ తోపాటే కలిసి వుంటున్నారు బాలయ్య. స్పెషల్ అరేంజ్ మెంట్లు అంటూ ఏవీ వద్దంటున్నాడట. ఆఖరికి భోజనం కూడా అందరిమధ్యే కలిసి చేస్తున్నారు. తన భోజనాన్ని తానే వడ్డించుకుంటున్నారు. యూనిట్ తోపాటు క్యూలో నిలుచుని ఆహార పదార్థాలు స్వయంగా వడ్డించుకొని తింటున్నారు. తెలుగు సినిమా సెట్లో అలాంటి వాతావరణాన్ని ఎప్పుడో కానీ చూడం మరి! బాలయ్య స్వయంగా వడ్డించుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *