బంజారాహిల్స్లో బాలకృష్ణ కారు బీభత్సం

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్లో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఫార్చునర్ కారు(AP 02 AY 0001) అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరుతో ఆ కారు రిజిష్ట్రేషన్ ఉన్నట్లు గుర్తించారు.

ప్రమాద సమయంలో బాలకృష్ణ కారులో లేనట్లు తెలుస్తోంది. కారులోని వారు ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అర్థరాత్రి సమయం కావడం వల్ల జనసంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *