త్వ‌ర‌లో న్యూస్ ఛానెల్ అధిప‌తిగా బాల‌కృష్ణ‌..?

ప్ర‌స్తుతం ఫిల్మ్ స‌ర్కిల్ తో పాటు ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో కూడా ఒక న్యూస్ షికారు చేస్తోంది. ఆ న్యూస్ సారాంశం ఏమిటంటే త్వ‌ర‌లో విజ‌య‌వాడ కేంద్రంగా నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ ఒక న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ్డాక కూడా ఏపీలో ఒక్క న్యూస్ ఛానెల్ కూడా లేదు. ప్ర‌స్తుతం అన్ని న్యూస్ ఛానెళ్లు హైద‌రాబాద్ కేంద్రంగానే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. గ‌తంలో ఒక‌టి రెండు ఛానెళ్లు విజ‌య‌వాడ‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు. ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో ఒక్క న్యూస్ ఛానెల్ కూడా లేదు.

దీంతో కేవ‌లం ఏపీకే ప‌రిమిత‌మ‌య్యేలా బాల‌కృష్ణ ఒక న్యూస్ ఛానెల్ పెడ‌తార‌ని తెలుస్తొంది. విజ‌య‌వాడ కేంద్రంగా రానున్న ఈ న్యూస్ ఛానెల్ కు ఇప్ప‌టికే ఆఫీసును కూడా ఏర్పాటు చేసార‌ని స‌మాచారం. ఈ ఛానెల్ లో బాల‌య్య తో పాటు ప‌లువురు ఏపీ నాయ‌కులు కూడా పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవ‌లే ఒక లీడింగ్ న్యూస్ ఛానెల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుకు ఈ ఛానెల్ భాద్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నార‌ట‌. అయితే ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *