మహానటి హిట్టుతో బాలయ్యకి టెన్షన్

టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషన్స్ దిశగా దూసుకుపోతున్న సినిమా మహానటి. ఫిలిం పర్సనాలిటీపై తెలుగులో వచ్చిన తొలి చిత్రం అయిన మహానటి కొత్త బెంచ్ మార్క్ లను చాలానే సెట్ చేసేట్లుగా ఉంది. అయితే.. ఈ చిత్రం ఇప్పుడు ఇతర ప్రాజెక్టులకు కూడా టెన్షన్ పెట్టించేస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలపై ఎలా ప్రభావం చూపుతుందనే అంశాన్ని పక్కన పెడితే.. రాబోయే చిత్రాలకు మాత్రం మహానటి టెన్షన్ తప్పేట్లుగా లేదు.

ముఖ్యంగా  బయోపిక్ అంటే ఇలా ఉండాలి అంటూ ఓ బెంచ్ మార్క్ ను మహానటి సెట్ చేసేసిందనే విషయాన్ని ఒప్పుకోవాలి. దీంతో ఇప్పుడు సెట్స్ పై ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కూడా.. జనాలు ఆ స్థాయిలోనే కాదు.. అంతకు మించి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందులోనూ నందమూరి తారక రామారావు లాంటి లెజెండరీ పర్సనాలిటీ పై అంటే అంచనాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. కేవలం లీడ్ రోల్ చుట్టూ కథను తిప్పేస్తే సరిపోదు.  కమర్షియల్ సినిమాలకు ఇలా వర్కవుట్ కావచ్చు కానీ.. బయోపిక్ అంటే జీవితాన్ని ఆవిష్కరించాలి. జనాలకు తెలిసిన కథనే రక్తి కట్టించాల్సి ఉంటుంది.

ఇప్పటికే డైరెక్షన్ విషయంలో ఎన్టీఆర్ మూవీకి ఎదురుదెబ్బ తగిలింది. బాలయ్య స్వయంగా హ్యాండిల్ చేస్తారని అంటున్నారు. మరి మహానటిలో నాగ్ అశ్విన్ చూపిన ప్రతిభ.. ఇన్ డెప్త్ అనాలలిసిస్.. ఎమోషన్స్ క్యారీ చేయగలడం వంటివి.. ఎన్టీఆర్ చిత్రానికి కూడా సాధ్యమవుతాయా అని చూడాల్సి ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *