షూటింగ్ పూర్తిచేసుకున్న బాలయ్య 100వ చిత్రం !

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్రశాతకర్ణి’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలో గొప్ప కీర్తి గడించిన రాజు శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని పోరాట, ఇతర కీలకమైన సన్నివేశాల్ని ఇప్పటికే పూర్తి చేసిన క్రిష్ ఈ చిత్రంలోని ఆఖరి పాటను బాలయ్య, శ్రియలపై రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయింది.

దీంతో యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టింది. డిసెంబర్ మొదటి వారంలో థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసి, రెండవ వారంలో ఘనంగా ఆడియో వేడుకను జరపాలని నిర్ణయించారు. అలాగే సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ కు పెద్దగా గడువు లేకపోవడంతో టీమ్ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భిన్నమైన రీతిలో ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమాలో శ్రియ శరన్ కథానాయిక కాగా, హేమమాలిని బాలకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *