బాల‌య్య – రానా… డైలాగ్ వార్‌

డైలాగ్ చెప్పాలంటే బాల‌కృష్ణ త‌ర‌వాతే ఎవ‌రైనా. ఈ త‌రంలో రానా కూడా అద్భుతంగా చెప్పేస్తున్నాడు. అతని తెలుగు ఉచ్ఛ‌ర‌ణ చూస్తే ఆహా అనాల్సిందే. అలాంటి బాల‌య్య – రానాల మ‌ధ్య డైలాగ్ వార్ న‌డిస్తే ఎలా ఉంటుంది? అదే చూడ‌బోతున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. అయితే వెండి తెర‌పై కాదు, బుల్లి తెర‌పై. రానా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో.. నెంబ‌ర్ వ‌న్ యారీ. ఈ షోలో నంద‌మూరి బాల‌కృష్ణ అడుగుపెట్టాడు. పూరి, బాల‌య్య క‌ల‌సి ఈ షోలో పాలుపంచుకొన్నారు.

ఈరోజు హైద‌రాబాద్‌లో యారీ షూటింగ్ కూడా జ‌రిగిపోయింది. ఈ సంద‌ర్భంగా రానా – బాల‌య్యల మ‌ధ్య డైలాగ్ వార్ జ‌రిగింద‌ట‌. ‘ఏమంటివి.. ఏమంటివి’ అనే పాపుల‌ర్ డైలాగ్‌ని రానా, బాల‌య్య పోటీ ప‌డి మ‌రీ చెప్పార్ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ఎపిసోడ్ల‌లో ఇదే హైలెట్‌గా నిల‌వ‌బోతోంద‌ని నిర్వాహ‌కులు ఆశ ప‌డుతున్నారు. మ‌రోవైపు ‘బిగ్ బాస్‌’ షోకి.. ‘పైసా వ‌సూల్‌’ టీమ్ నుంచి ఎవ‌రెళ్తారు? అనే ఆసక్తి నెల‌కొంది. కొత్త సినిమాలొస్తున్న‌ప్పుడు న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి సంద‌డి చేస్తున్నారు. ‘స్పైడ‌ర్‌’ కోసం మ‌హేష్ బిగ్ బాస్ సెట్లో అడుగుపెడుతున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. పైసా వ‌సూల్ కోసం బాల‌య్య ఎలాగూ వెళ్ల‌డు. పూరికీ ఎన్టీఆర్‌కి చ‌క్క‌టి అనుబంధం ఉంది కాబ‌ట్టి – పూరి ఈ రియాలిటీ షోలో పాలు పంచుకొంటాడా? లేదంటే నెంబ‌ర్ వ‌న్ యారీతోనే స‌రిపెట్టుకొంటారా? చూడాలి మ‌రి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *