షాక్ ఇస్తున్న బాలయ్య న్యూలుక్

bala krishnaఅగ్ర కథానాయకుడు బాలకృష్ణ గత కొన్ని రోజులుగా ఆయన మీడియా కంటపడలేదు. తాజాగా బయటికి వచ్చిన బాలయ్య కొత్త ఫొటో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఓ అభిమాని బాలయ్యతో సెల్ఫీ దిగారు. ఆయన కొత్త లుక్‌లో చాలా యంగ్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. యన్‌.టి.ఆర్ తర్వాత ఆయన కె.ఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డాన్‌ పాత్రలో కనిపించనున్నారట. అందుకోసం కొత్త లుక్‌ లో రెడీ అయ్యారు. దీంతో నెటిజన్లు చూడటానికి అచ్చం ‘ఐరన్‌మ్యాన్‌’లా ఉన్నారని కామెంట్లు చేశారు.

Videos

46 thoughts on “షాక్ ఇస్తున్న బాలయ్య న్యూలుక్

Leave a Reply

Your email address will not be published.