101 వ సినిమా ప్రకటించిన బాలయ్య, పూర్తి వివరాలు.

ఎక్స్ ప్రెస్ వేగం మెంటైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఒక సినిమా పూర్తవ్వకముందే మరో సినిమాని లైన్లో పెట్టేస్తున్నాడు. ఆ జోరు  కుర్ర హీరోలకి ఏమాత్రం తగ్గని విధంగా ఉంది. ఒక పక్క  వందో చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణిలో నటిస్తూనే మరో పక్క 101వ చిత్రాన్ని ప్రకటించేశాడు బాలయ్య.

ఈ సినిమాను ‘రైతు’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.అయితే రైతు కథ బాగా నచ్చడంతో 101వ చిత్రంగా దాన్ని చేయాలని నిర్ణయించుకొన్నారు. కృష్ణవంశీ కూడా అందుకు సంబంధించి పక్కాగా స్క్రిప్టుని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రైతు సమస్యల నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలిసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *