‘సైరా’ సెట్స్కు వెళ్లిన బాలయ్య..!

టాలీవుడ్ స్టార్ హీరోలు అంటే ఒకప్పుడు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి – బాలకృష్ణ. వీరిద్దరు సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా తలపడిన వారే. వీరిద్దరు కూడా ఎన్నో సార్లు బాక్సాఫీస్ ఫైట్ కు తెరలేపారు. వీరిద్దరి అభిమానుల మద్య తారా స్థాయిలో అప్పట్లో వివాదాలు ఉండేవి. అభిమానుల మద్య ఎన్ని వివాదాలు ఉన్నా కూడా వీరిద్దరు మాత్రం సందర్బానుసారంగా కలుస్తూ – ఒకరి వేడుకల్లో ఒకరు పాలుపంచుకుంటూ ఉంటూనే ఉన్నారు. తామిద్దరం మంచి మిత్రులం అని చెప్పుకుంటారు. ఆ మిత్రుత్వంను ఇద్దరు కూడా కాపాడుకుంటూ వస్తున్నారు.

ఆమద్య బాలకృష్ణ సినిమా వేడుకలో పాల్గొన్న చిరంజీవి మరో సారి బాలయ్యపై ఆత్మియతను చాటుకున్నాడు. ఇక తాజాగా చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ సెట్స్ కు వెళ్లి చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యపర్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరన హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది. సైరా చిత్రీకరణ కూడా ఆ పక్కనే జరుగుతుందని తెలుసుకున్న బాలకృష్ణ వారికి ఇన్ ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే వెళ్లాడట.

బాలయ్య రాకతో చిరంజీవి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అని – ఇద్దరు దాదాపు గంట పాటు సరదాగా ముచ్చటించుకున్నారట. ఒకటి రెండు షాట్స్ చిత్రీకరణను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా సైరా చిత్రీకరణ సందర్బంగా వెళ్లడం జరిగింది. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. కాని బాలయ్య సైరా సెట్స్ కు వెళ్లిన విషయం మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. సోషల్ మీడియాలో బాలయ్య – చిరులకు సంబంధించిన ఫొటోలు కూడా రాలేదు. సందర్బం వచ్చినప్పుడు ఆ ఫొటోలను సైరా యూనిట్ విడుదల చేస్తుందేమో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *