ఖైదీ గురించి బాలయ్య ఏమన్నారంటే..

బాలయ్య న వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు.. ఇంకా పట్టుమని 36 గంటల టైం ఉందంతే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్స్ తో.. విపరీతమైన హైప్ పెరిగిపోతోంది. మరోవైపు శాతకర్ణి మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం అందిస్తున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య తెగ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేవలం తన సినిమా గురించే కాకుండా.. పోటాపోటీగా రిలీజ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150పై కూడా స్పందించారు బాలయ్య.

‘నాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత ముఖ్యమో.. చిరంజీవికి ఖైదీ నంబర్ 150 కూడా అంతే. రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాలని.. రెండూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనం కావాలని ఆశిస్తున్నా’ అన్నారు బాలకృష్ణ. సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడ్డం ఎప్పుడూ జరుగుతుండేదే అని.. ఇందులో కొత్త ఏమీ లేదని.. కాంపిటీషన్ పై సింపుల్ గా తేల్చేశారు నందమూరి బాలకృష్ణ

ఇప్పటికే ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ ఈవెంట్లో.. గౌతమిపుత్ర శాతకర్ణి విజయం సాధించాలని.. మంచి సినిమాను ఆదరించాలని చిరు అండ్ టీం విజ్ఞప్తి చేసిన విషయం తెలసిందే. ఇంత పోటీగా సినిమా రిలీజ్ చేసుకుంటూ కూడా.. ఇద్దరి సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్న ఈ ఇద్దరు బడా హీరోలు.. ఏ స్థాయి స్నేహితులో.. ఈ ఇన్సిడెంట్స్ నిరూపించేస్తున్నాయి కదూ.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *