భూమా ఎపిసోడ్ లో ముఖ్యపాత్ర ఎవరు

అధికారానికి పెద్దగా దూరం ఉండే తరహా కాదు భూమా కుటుంబానిది. కానీ వాళ్లు 2004 నుంచి కూడా  అధికారానికి దూరంగానే  ఉండాల్సి వచ్చింది పాపం.. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్షకు ఈ నంద్యాల చేప చాలా ఈజీగా పడింది.

 

balayya-is-the-mediator-between-bhuma-and-babu
balayya-bhuma-and-babu

వైకాపా అధినేత కు భూమా నాగిరెడ్డి ఎంతకూ టచ్ లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో భూమా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖరారయిన విషయమే అనుకోవాలి. తాజాగా చర్చల కోసం విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిని కర్నూలుకు పంపించాడు జగన్ మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం ఇచ్చిన హామీల పవర్ ముందు వీరి  రాయబారానికి అంత విలువ ఉండదనే అనుకోవాల్సి వస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భూమాతో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాయబారం నడిపింది నందమూరి నటసింహం బాల కృష్ణ కావడం. అధికారం ఆకలితో చాలా కాలం నుంచి అలమటిస్తున్న భూమా విషయంలో కీలెరిగి వాత పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎస్సీ అట్రాసిటీ కేసుతో జైలు కాని జైలేన ఆసుపత్రిలో నెల రోజుల పాటు కూర్చుకున్నాడు భూమా.

ఆ సమయంలో జగన్ ఆయనను పరామర్శించాడు, ప్రభుత్వం తీరును ఖండించాడు కానీ ఇంకేమీ చేయలేని పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అలాంటి కేసుల ఇబ్బందులన్నీ తప్పి.. మంత్రి పదవి దక్కుతుందంటే.. భూమా కు మరేమీ గుర్తొచ్చే అవకాశం ఉండదు కదా!

భూమా ఫ్యామిలీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో టే వైఎస్సార్ కు టచ్ లోకి అయితే వచ్చింది. ఎస్వీ సుబ్బారెడ్డి దౌత్యంతో వీళ్లు  కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో ఆళ్లగడ్డ నియో జకవర్గంలో కాంగ్రెస్ తరపున పనిచేస్తన్నగంగుల ఫ్యామిలీని పరిగణనలోకి తీసుకుని వైఎస్ఆర్ వీళ్ల ను పార్టీలోకి తీసుకోలేకపోయాడు.

ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ ఉదయించడంతో వీళ్లను అటువైపు పంపి.. పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకున్నాడు రాజశేఖరరెడ్డి. ఆతర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్ లో విలీనం కావాల్సిన వీళ్లు..మరో ఐదేళ్లు, ఆ పై వైకాపా తరపున ఇంకో ఐదేళ్లు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. షార్ట్ కట్ లో చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మొగ్గుచూపినట్టున్నారు!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *