బాలయ్యకు తెలిస్తే అంతే! రహస్యంగా వీడియో తీసిన కుర్రాళ్లు, నెట్లో వైరల్…

నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని స్నాక్స్ తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆయన పక్క టేబుల్‌లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన వీడియో అనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బాలయ్య ఎక్కడికెళ్లినా ఎవరో ఒకరు ఆయన వెంట ఉంటారు. మరి బాలయ్య ఒంటరిగా కూర్చున్న ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనేది చర్చనీయాంశం అయింది.

వీడియో తీస్తున్నట్లు బాలయ్యకు తెలిస్తే గొడవ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయనకు తెలియకుండా రహస్యంగా మొబైల్ ఫోన్ ద్వారా ఈ వీడియో చిత్రీకరించారు.అసలే బాలయ్యకు మహా కోపం. తన అనుమతి లేకుండా వీడియో తీస్తే అంతే సంగతులు. ఇటీవల కాలంలో బాలయ్య తనకు చిరాకు తెప్పించిన అభిమానులపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే.

బాలయ్య ఎంతో సింపుల్‌గా ఉంటారు, స్టార్ డమ్ అస్సలు లెక్క చేయరు, ఎంత మంది హీరోలు ఇలా సింపుల్ గా ఉంటారు. కానీ కొందరు యాంటీ ఫ్యాన్స్ బాలయ్య ఎప్పుడు దొరుకుతాడు, వీడియో తీసి ఎఫ్‌బిలో పెడదామా అని రెడీగా ఉంటారు. ఏం పీక్కుంటారో, పీక్కోండి అంటూ… బాలయ్య అభిమానులు తమ హీరోకు మద్దతుగా నిలిచారు.

సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *