పది వికెట్ల తేడాతో టీమ్‌ఇండియా ఘనవిజయం

యువ క్రికెటర్లకు అవకాశమిస్తూ తొలి టీ20లో ప్రయోగాలు చేసిన టీమ్‌ఇండియా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంది. సోమవారం ఏకపక్ష రీతిలో సాగిన మ్యాచ్‌లో ధోనీసేన 10 వికెట్లతో విజయం సాధించింది. గెలుపు పరంగా పొట్టిఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు ఇదే అత్యుత్తమం కావడం విశేషం. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే..నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. స్రాన్‌తో (4-0-10-4) పాటు బుమ్రా(4-0-11-3) జింబాబ్వే పతనాన్ని శాసించారు. వీరిద్దరి ధాటికి జింబాబ్వే ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా..మణ్‌దీప్‌సింగ్(40 బంతుల్లో 52 నాటౌట్, 6ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధసెంచరీకి తోడు రాహుల్(40 బంతుల్లో 47 నాటౌట్, 2ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో మరో 41 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోకుండా విజయం అందుకుంది. 4 కీలక వికెట్లు కూల్చి టీమ్‌ఇండియా భారీ విజయానికి కారణమైన స్రాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

జింబాబ్వేతో రెండో టీ20 ల్లో స్రాన్ చెలరేగిన తీరు ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌కు దిగిన స్రాన్..మసకద్జ(10), సికిందర్ రజా(1), ముతుంబోద్జి(0) వెంటవెంటనే ఔట్ చేసి జింబాబ్వేను ఘోరంగా దెబ్బతీశాడు. అప్పటి వరకు 25/1 స్కోరుతో సాఫీగా సాగుతున్న జింబాబ్వే ఇన్నింగ్స్ స్రాన్ విజృంభణతో ఒక్కసారిగా 28/4కు పడిపోయింది. ఇలా అరంగేట్రం చేసిన తొలి టీ20 మ్యాచ్‌లోనే పది పరుగులకే 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా స్రాన్ నిలిచాడు. అంతకుముందు 2012లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ సన్నీ(5/13) ఐదు వికెట్ల ప్రదర్శన ఓవరాల్‌గా అత్యుత్తమ రికార్డు.

జింబాబ్వే:

చిభాభ (సి)రాయుడు(బి)స్రాన్ 10, మసకద్జ(బి)స్రాన్ 10, మూర్ (సి)అక్షర్‌పటేల్(బి)బుమ్రా 31, రజా(సి)రాహుల్(బి)స్రాన్ 1, ముతుంబోద్జి(ఎల్బీ)(బి)స్రాన్ 0, వాలర్(సి)పటేల్(బి)చాహల్ 14, చిగుంబుర(బి)బుమ్రా 8, క్రెమర్(సి) రాయుడు(బి)కులకర్ణి 4, మద్జీవ(బి)బుమ్రా 1, తిరిపానో 11 నాటౌట్, ముజుర్‌బనీ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 99/9; వికెట్ల పతనం: 1-14, 2-26, 3-28, 4-28, 5-57, 6-75, 7-81, 8-83, 9-91; బౌలింగ్: స్రాన్ 4-0-10-4, కులకర్ణి 4-0-32-1, అక్షర్‌పటేల్ 4-0-23-0, చాహల్ 4-1-19-1, బుమ్రా 4-0-11-3.

భారత్:

రాహుల్ 47 నాటౌట్, మణ్‌దీప్‌సింగ్ 52 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 13.1 ఓవర్లలో 103; బౌలింగ్: తిరిపానో 3-0-11-0, మద్జీవ 2.1-0-19-0, ముజర్బనీ 2-0-17-0, క్రెమర్ 3-0-24-0, చిభాభ 2-0-23-0, రజా 1-0-9-0.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *