దినేష్ కార్తిక్ ను క్షమించినట్టు ప్రకటించిన బి‌సి‌సి‌ఐ

భారత క్రికెటర్ దినేష్ కార్తిక్ తప్పునీ బి‌సి‌సి‌ఐ ఎట్టకేలకు మన్నించింది. కరేబియన్ ప్రియర్ లీగ్ (సిసియల్)లో త్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నందుకు అతనికి నోటీసులు జారీ చేసినా సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో జరిగిన తొలి మ్యాచుకు కార్తిక్ హాజరయ్యాడు. త్రిన్ బాగో జెర్సీ ధరించి డ్రెస్సింగ్ రూమ్ నుండి మ్యాచ్ చూస్తున్న ఫోటోలు బి‌సి‌సి‌ఐ కు చిక్కాయి. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద కార్తిక్ కు బి‌సి‌సి‌ఐ నోటీస్ పంపించింది.

బి‌సి‌సి‌ఐ నిబంధనల ప్రకారం ఫాస్ట్ క్లాస్ క్రికెటర్ ఐ‌పి‌ఎల్ లో తప్ప మరి ఏ ఇతర లిగుల్లో ఆడేందుకు అనుమతి లేదు. దీనితో బి‌సి‌సి‌ఐ కార్తిక్ నోటీసులు జారీ చేసింది. బి‌సి‌సి‌ఐ నోటీసులతో తన తప్పునీ తెలుసుకున్న దినేష్ కార్తిక్ ఇటీవల క్షమాపణ కోరుతూ లేఖ రాశాడు. ఇకపై ఇలాంటి తప్పులు జరగవని బి‌సి‌సి‌ఐ కి లేఖ రాశాడు. దీనితో దినేష్ తప్పునీ మన్నించిన బి‌సి‌సి‌ఐ ఈ వివాదం ముగిసినట్టు ప్రకటించింది.

Videos