వేడుకలా 500వ టెస్ట్ మ్యాచ్: మాజీ కెప్టెన్లందరికీ ఆహ్వానం

భారత్, న్యూజిలాండ్‌తో ఈనెల 22న కాన్పూర్‌లో జరుగనున్న తొలిటెస్టు కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. భారత్‌కు 500వ టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి ఓ ప్రత్యేకతను కల్పించాలనే ఉద్దేశంతో బోర్డు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా టెస్టు మ్యా చ్‌కు వాడే టాస్ కోసం ప్రత్యేకంగా ఓ సిల్వర్ కాయిన్‌ను రూపొందించింది. అలాగే మ్యాచ్ సమయంలో మాజీ కెప్టెన్లందర్ని ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే భారత్‌కు ఘనమైన విజయాలు అందించిన మాజీ సారథి అజహరుద్దీన్‌ను మాత్రం ఈ వేడుకలకు పిలవడం లేదు.

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కోర్టు అజహర్‌ను నిర్దోషి అని ప్రకటించినా బోర్డు మాత్రం ఇంకా వివక్ష చూపుతుండటం విమర్శలకు దారితీస్తున్నది. గతంలో చాలా మంది తమకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తర్వాతి కాలంలో క్షమించి అక్కున చేర్చుకున్న బోర్డు ఈ హైదరాబాద్ ఆటగాడి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని చూపుతున్నది. నారీ కంట్రాక్టర్, చందూ బోర్డే, కపిల్, వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, గవాస్కర్, గంగూలీ, సచిన్, సెహ్వాగ్, శ్రీకాంత్‌లతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న ద్రవిడ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *