భ‌జ్జీ జోక‌ర్‌.. గంగూలీ వెర్రి మొహం!

న్యూఢిల్లీ: అండ‌ర్‌డాగ్స్‌గా బ‌రిలోకి దిగి తొలి టెస్ట్‌లో టీమిండియాను మ‌ట్టిక‌రిపించిన ఆస్ట్రేలియా ఇప్పుడు మాంచి ఊపులో ఉంది. వాళ్ల ప్లేయ‌ర్స్ 13 ఏళ్ల త‌ర్వాత భార‌త గ‌డ్డ‌పై వ‌చ్చిన ఈ విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. అక్క‌డి మీడియా మాత్రం నోరు పారేసుకుంటున్న‌ది. స్టీవ్ స్మిత్ సేన‌ను త‌క్కువ చేసి మాట్లాడిన మన ప్లేయ‌ర్స్‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఎప్ప‌టిలాగే త‌మ చిర‌కాల శ‌త్రువైన హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ను ల‌క్ష్యంగా ఎంచుకుంది అక్క‌డి మీడియా. ఆస్ట్రేలియా బాగా ఆడితే ఇండియా 3-0తో సిరీస్ గెలుస్తుంద‌ని భ‌జ్జీ సిరీస్‌కు ముందు అంచనా వేసిన సంగ‌తి తెలిసిందే క‌దా. తొలి టెస్టులోనే అది రివ‌ర్స్ అవ‌డంతో హ‌ర్భ‌జ‌న్ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు.

హ‌ర్భ‌జ‌న్‌ను ఓ పెద్ద జోక‌ర్ అంటూ ఆసీస్ వెబ్‌సైట్ న్యూస్‌.కామ్‌.ఏయూ అభివ‌ర్ణించింది. 2008 ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో సైమండ్స్‌ను హ‌ర్భ‌జ‌న్ కోతి అన్నాడంటూ అప్ప‌ట్లో ఆసీస్ మీడియా నానా యాగీ చేసింది. అప్ప‌టి నుంచి భ‌జ్జీ అంటే కంగారూల‌కు అస్స‌లు ప‌డ‌టం లేదు. దీంతో ఇప్పుడు దొరికిందే చాన్స్ అని అత‌నిపై తిట్ల దండ‌కం అందుకున్న‌ది. భ‌జ్జీ నిల్‌, ఆస్ట్రేలియా 1 అని ఆ వెబ్‌సైట్ త‌న ఆర్టిక‌ల్‌లో రాసింది. ఇక భ‌జ్జీతోపాటు త‌మ‌కు న‌చ్చ‌ని మ‌రో ప్లేయ‌ర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ. అత‌నిపై కూడా ఆసీస్ మీడియా విరుచుకుప‌డింది. అత‌నో వెర్రి మొహ‌మ‌ని, ఊరికే అరుస్తుంటాడ‌ని అక్క‌డి మీడియా విమ‌ర్శంచింది. ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటంటే.. ఇండియ‌న్స్‌నే కాదు.. ఆసీస్ మాజీల‌ను కూడా అక్క‌డి మీడియావ‌ద‌ల్లేదు. ఆసీస్ టీమ్‌ను, తొలి టెస్ట్‌లో రాణించిన ఓకీఫ్‌ను త‌క్కువ అంచ‌నా వేసిన షేన్ వార్న్‌, స్టీవ్ వాలాంటి దిగ్గ‌జాల‌పై మీడియా విమ‌ర్శ‌లు గుప్పించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *