నంద్యాల ఉప ఎన్నిక: అఖిలప్రియ సవాల్.. శిల్పా ప్రతిసవాల్

ఏపీ రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కర్నూలు రాజకీయాల్లో సంచలన ప్రకటనలకు కారణమైంది. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయక ముందే ఊహించనిరీతిలో సవాళ్లు.. ప్రతిసవాళ్లతో కర్నూలు జిల్లా రాజకీయ వాతావరణం మారిపోయింది.

ఒక ప్రముఖ ఛానల్ మంత్రి భూమా అఖిలప్రియ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి బ్రాహ్మనందరెడ్డి గెలిస్తే.. ఆ క్రెడిట్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరిదని.. ఓడిపోతే మాత్రం తనదే పూర్తి బాధ్యతని చెప్పారు.

అక్కడితో ఆగని ఆమె.. ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోయిన పక్షంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. మంత్రి అఖిలప్రియ సవాలును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డి స్వీకరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవల ప్రకటించిన శిల్పా మాట్లాడుతూ.. తాను కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని ప్రతిసవాలు విసిరారు.ఈ ఇరువురి నేతల ప్రకటనలతో నంద్యాల నియోజకవర్గ రాజకీయమే కాదు.. కర్నూలు జిల్లా రాజకీయంలో ఒక్కసారి హీట్ జనరేట్ అయ్యిందని చెప్పొచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *