అందరినీ ఏడిపించిన బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎపిసోడ్ – 13 కి సంబంధించిన పూర్తి వీడియో కింద ఇవ్వటం జరిగింది చూసి ఆనందించండి.

బిగ్ బాస్ ఎపిసోడ్ 13, వరుణ్ సందేశ్ కెప్టెన్ గా ఎన్నుకయ్యాడు కనుక తన కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో చూద్దామూ.. అనే బిగ్ బాస్ వాయిస్ తో ప్రారంభం అయ్యింది, వితిక వరుణ్ తో కలిసి కూర్చొని కబుర్లాడుతూ… తను కెప్టెన్ గా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఎవరిని అదుపులో పెట్టాలి, ఇంగ్లీషు మాట్లాడుతున్న వారిపై కన్నేసి ఉంచాలి, అందరిని తెలుగులోనే మాట్లాడేలా చూడాలంటూ భోధన చేసుకొచ్చింది, ఇక పోతే.. రవికృష్ణ వరుణ్ సందేశ్ తో మాట్లాడుతూ.. తన స్నేహితుడు అలిరెజాను కాదని వరుణ్ సందేశ్ కు ఓటు వెయ్యటం పట్ల తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు, తన ఓటు అలిరెజాకి వేస్తే ఏం ప్రయోజనం లేదనీ.. వరుణ్ అయితే.. ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి తనకేమైనా ఉపయోగపడుతుందేమో అనే.. సదుద్దేశ్యంతో వరుణ్ కి ఓటు వేసినట్టుగా చెప్పుకొస్తాడు కానీ.. మళ్లీ వెంటనే.. బయటికి వచ్చి అలిరెజా.. శ్రీముఖిలతో కలిసి కూర్చొని వరుణ్ అసలు కెప్టెన్ కాకపోతే ఈసారి ఇంటినుండి తనే.. ఎలిమినేట్ అయ్యేవాడని సటైర్లు వేసుకున్నారు, అలాగే బాబా భాస్కర్, శ్రీముఖి, మహేష్ విట్టా, అలి రెజాలు కలిసి స్మోకింగ్ జోన్ ఏరియాలో వరుణ్ సందేశ్ కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటూ.. రాహుల్ సిప్లిగంజ్ బయట తనకు మంచి స్నేహితుడని, ఇక్కడ తను వెరొకరి వల్ల ప్రభావం అవుతున్నాడని అందుకే.. తనతో మాట్లాడటం మానేసానని చెప్పుకొచ్చింది శ్రీముఖి, అటు ముందురోజు అలిపై తమన్నా నోరు జారిన సంగతి తెలిసిందే.. ఈ విషయమై అలిరెజా తమన్నాతో కలిసి కూర్చొని తను కావాలని ఏదీ చేయలేదని, తన మనసు నొప్పించే ఉద్దేశ్యం తనకు లేదని దిల్ సే సారీ చెప్తున్నానని చెప్పుకొచ్చాడు, తమన్నా కూడా తన సారీని స్వీకరించి నువ్వు నా తమ్ముడి లాంటివాడివని చెప్పుకొచ్చింది, ఇక పోతే.. కాసేపట్లో లగ్జరీ బడ్జెట్ గురించి షాపింగ్ చేయాల్సి ఉండగా.. వితిక వరుణ్ లు కూర్చొని అందరితో కలిసి ఎవరికి ఏం కావాలో కనుక్కుందామని మాట్లాడుకుంటూ.. ఇంట్లోకి పెరుగు కావాలా అన్నప్పుడు వితిక అవసరం లేదు, ఉన్నదాన్నే.. తోడు వేస్తే సరిపోతుంది అనగానే.. అదే పెరుగుతో మళ్లీ పెరుగు చేయొచ్చా.. అలా ఎన్ని సార్లైనా చేయొచ్చా.. అని అమాయకుడిలా వరుణ్ అడిగిన ప్రశ్నకు, కనీసం ఈ విషయం కూడా తెలీదా వరుణ్ కి అని నవ్వు తెప్పిస్తుంది, కాగా..

బిగ్ బాస్ లగ్జరి బడ్జెట్ సంపాదనకై ఇంట్లోని ముగ్గురు సభ్యులు బట్టులు ఉతకాలని, అందుకోసం వాడే సబ్బుల్లో గోల్డ్ మరియూ సిల్వర్ కాయిన్స్ ఉన్నాయని, సబ్బును అరగదీసి ఎన్ని కాయిన్స్ సంపాదిస్తే.. వాటితో లగ్జరీ షాపింగ్ చేయొచ్చని చెప్పగ, జ్యోతి, రోహిని, రవికృష్ణలు బట్టలుతికి కొన్ని కాయిన్స్ ని సాధించడంతో లగ్జరీ షాపింగ్ కి అర్హులయ్యారు, అయితే ఈ షాపింగ్ ముగిసిన తర్వాత ఎవరు కూడా కొన్న వస్తువుల సంఖ్యను మార్చటానికి వీళ్లేదు. అయినా కూడా వరుణ్ సందేశ్ పట్టించుకోకుండా కాఫీ ప్యాకెట్స్ నెంబర్ ను మార్చడంతో బిగ్ బాస్ కోపోద్రిక్తుడై ఇంటి సభ్యులందరికీ వార్నింగ్ ఇచ్చాడు, మరోసారి ఇలాంటిది జరిగితే మొత్తానికే లగ్జరీ బడ్జెట్ ఉండదని హెచ్చరించడంతో ఇంటి సభ్యులు క్షమాపణ కోరటం జరిగింది, కాగా.. వెంటనే.. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో వారి జీవితాల్లో జరిగిన చేదు అనుభవాలను పంచుకొమ్మని చెప్పటంతో… ఒక్కొక్కరు వారి వారి జీవిత అనుభవాలను చెప్పుకున్నారు, అలి రెజా తన భార్యతో బండిపై వెళ్తుండగా యాక్సిడెంట్ అయి తన భార్య కాలుకి ఫ్రాక్చర్ అయ్యిందని, తను కావాలని చేయకపోయినా.. తనకి ఇంకా అదే బాధ ఉందని చెప్పుకొచ్చాడు, తర్వాత జాఫర్ తన అక్కయ్యకు పెరాలిసిస్ వచ్చిందని, ఎవరూ.. సరిగా పట్టించుకోకపోవటంతో కోమాలోకి వెళ్ళిందని బాధపడ్డాడు, ఇక శ్రీముఖి తన తాత గారు మరణించే ముందు రోజున తనని చూడాలని ఉందని రమ్మన్నాడని, అప్పుడు తనకు వీలు పడక వెళ్లలేదని, తెల్లవారున వెళ్ళే లోపే తాతయ్య చనిపోయాడని, తను చివరిగా నన్ను చూద్దామనుకున్నాడు, నేను వెళ్లలేదంటూ కన్నీరు మున్నీరయ్యింది, రోహిణి తనకు యాక్సిడెంట్ అయి చాలా రోజులు బెడ్ రెస్ట్ లో ఉండటమే తనను బాధపెట్టిన అంశమని చెప్పుకొచ్చింది, ఇక హిమజ తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని తను అమ్మని సంతోషంగా చూసుకోవటమే.. తన లక్ష్యమని చెప్పుకురాగా.. బాబా భాస్కర్ మాట్లాడుతూ.. తను పచ్చి తాగుబోతులా ఉండేవాణ్ణని, తన తండ్రి మాటలు బంగారు మూటలని ఇప్పుడు అర్ధమవుతున్నాయని, కానీ.. తెలుసుకునేలోగా తండ్రి చనిపోయాడని, ముందే తెలిసుంటే.. తండ్రిని సంతోషంగా చూసుకునేవాణ్ణని, ఎవ్వరు కూడా తనలా చెయ్యొద్దని చెప్పుకొచ్చాడు, రవికృష్ణ కూడా తన తండ్రికి నచ్చకుండానే టీవీ రంగానికి వచ్చానని, ఒకానొక సమయంలో సంపాదన లేక అవస్థలు పడ్డాడని, ఆ సమయంలో తనకు తండ్రి చేసిన సాయం, పడిన బాధను గుర్తు చేసుకుని కంటనీరు పెట్టుకున్నాడు, మహేష్ విట్టా.. తన స్నేహితుడి సాయంతో తను ఇండస్ట్రీలో మంచి స్థాయిలోకి వచ్చాడని, కానీ.. ఆ స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి తను పెద్దగా ఆరా తీయకపోవటంతో.. తనూ.. చెప్పుకోలేక, మరణించాడని, కొంత సమయం తన కోసం కేటాయించి, చికిత్స చేయించి ఉంటే బాగుండేదని బాధనంత వెల్లగక్కాడు, ఇక పునర్నవి తనకు ఒక అబ్బాయితో పరిచయం ఉందని, తన కోపం కారణంగానే.. అబ్బాయిని దూరం చేసుకుందని, ఈ మధ్యే శ్రీలంక కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో అబ్బాయి మరణించాడని, తను బ్రతికున్నప్పుడు తనతో కలవటానికి, మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించాడని, తనే.. కోపంతో దూరమయ్యిందని, బాబా భాస్కర్ చెప్పినట్టు మనిషి ఉండగానే.. విలువ తెలుసుకొని మెదలాలని చెప్పుకొచ్చింది, కాగా రాహుల్ సిప్లింగంజ్ తన లవ్ స్టోరీ చెప్తూ.. తన మాటలతో కాస్త కామిడీ క్రియేట్ చేసాడు, ఇక శివజ్యోతి తన ప్రేమగాథను చెప్పుకుంటూ కంటనీరు పెట్టుకుంది, తర్వాత వితిక మాట్లాడుతూ తనకు ఆర్ధికంగా, మానసికంగా బలాన్నిచ్చిన తన పిన్ని మరణం తనకు చేదు అనుభవాణ్ణి మిగిల్చిందని చెప్పుకు రాగా.. వరుణ్ సందేశ్ తన తండ్రిని కోపంతో ఇంట్లో నుండి పంపిచేసానని, తన విలువ ఇప్పుడు తెలిసిందని, తల్లి తండ్రి లేకపోతే మనం ఏం సాధించలేమని తెలసొచ్చిందని, అలాంటి ప్రేమ ఇప్పుడు వితిక రూపంలో దొరుకుతుందని చెప్పుకొచ్చాడు, మొత్తానికి అందరూ కలిసి ఒక రకంగా ప్రేక్షకులను కూడా వారి అనుభవాలతో కంట తడి పెట్టించారనే.. చెప్పుకోవాలి, తర్వాత, శ్రీముఖి తనపై అలిగిందనే.. విషయమై రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖి వెంట పడుతూ.. తన అలకకి కారణమేంటో.. కనుక్కునే పనిలో పడ్డాడు, అప్పుడే అక్కడకు వచ్చిన వరుణ్ సందేశ్ ఇద్దరినీ విచారించగా.. ఎవరూ అలగలేదని, తమ మధ్య భేదాలేమీ లేవని శ్రీముఖి చెప్పటంతో.. ఇద్దరిని హగ్ చేసుకొమ్మని చెప్పి, స్నేహితులని కలిపినట్టుగా చూపించి ఎపిసోడ్ ను ముగించారు.

పదమూడవ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తి రియాక్షన్ వీడియో లో పొందుపరచటం జరిగింది చూసి ఆనందించండి.

Videos

Leave a Reply

Your email address will not be published.