బిగ్ బాస్ లో వెక్కి వెక్కి ఏడ్చిన వితికా

బిగ్ బాస్-3 47వ ఎపిసోడ్ లో వితికా, వరుణ్ ల మధ్య గొడవతో మొదలయ్యింది. వితికా ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే వరుణ్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు అంటాడు దానికి వీటిక నా గురించి మాట్లాడొద్దు అంటుంది. అలా మొదలయిన వారి గొడవ మెల్లగా ఎక్కువ అయ్యింది. టైమ్ స్పెండ్ చెయ్.. టైమ్ స్పెండ్ చెయ్ అంటావ్ మనం వచ్చింది షో కి హనీమూన్ కి కాదు అని వరుణ్ అనడంతో వితికా గట్టిగా అరుస్తుంది. దీనితో వరుణ్ సీరియస్ అవుతాడు. ఇద్దరు పోట్లాడుతుండగా వితికా అక్కడి నుండి వెళ్ళిపోయి బాత్రూమ్ కి వెళ్ళి గట్టిగా ఏడుస్తుంది.  తరువాత వరుణ్ కూడా తన వెనకాలే వెళ్ళి వితికా ను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు.

‘నేను నువ్ నాకు టైం ఇవ్వడం లేదని అనడం లేదు.. నీతో హనీమూన్‌కి వచ్చాననే ఫీలింగ్ నాకు లేదు. నీ విషయంలో నేను పట్టించుకోను. నా క్యారెక్టర్‌ గురించి నువ్వు మాట్లాడకు. రూడ్‌గా నేను ఎక్కడ మాట్లాడా?’ అంటూ శాంతించడానికి చాలా టైం తీసుకుంది వితికా.

ఇక జైలులో ఉన్న రాహుల్, వరుణ్‌ల మధ్య సంబాషణ జరగ్గా.. పునర్నవి హర్ట్ అయ్యేట్టుగా మాట్లాడాడు రాహుల్. ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. దీనిపై సీరియస్ డిస్కషన్ జరుగుతుండుగా.. వాళ్ల జైలు శిక్ష ముగిసినట్టు ప్రకటించారు బిగ్ బాస్.

ఈ వారం కెప్టెన్ ని ఎన్నుకొనే భాగంగా  ముందుగా కెప్టెన్ కోసం అర్హులైన వారిని, అనర్హులైన వారిని ముగ్గురు చొప్పున పేర్లను చెప్పమని బిగ్ బాస్ చెప్పారు. దీనితో అనర్హలుగా శిల్పా, రవి, రాహుల్….బాబా భాస్కర్, హిమజ , శ్రీముఖిలను అర్హులుగా ప్రకటించారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అనర్హులుగా ఉన్నవారు అర్హులైన వారికి సహకరించాలని ఎవరు ఎవరి కోసం ఆడతారో వారే నిర్ణయించుకోవాలని చెబుతారు. దీనితో బాబా భాస్కర్ కోసం శిల్పా చక్రవర్తి, హిమజ కోసం రాహుల్, శ్రీముఖి కోసం రవి ఆడటానికి ముందుకు వచ్చారు. ఆపిన వాడిదే అధికారం అంటూ సాగిన ఈ టాస్క్‌లో శిల్పా చక్రవర్తి సాయంతో హౌస్ మిస్టర్ పర్ఫెక్ట్ బాబా బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యారు.

 

Videos