బిగ్ బాస్-3:చివరకు షూ పాలిష్ చేసిన పునర్నవి..కెప్టెన్ గా వితికా

బిగ్ బాస్-3 54వ ఎపిసోడ్ మహేష్, బాబా భాస్కర్ సంభాషణతో మొదలయ్యింది. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో టాస్క్ చేయనన్న పునర్నవిని వరుణ్ ఒప్పించడానికి ట్రై చేశాడు. ఎంత చెప్పిన తను మాత్రం షూ పాలిష్ చేయనని చెప్పింది. బాబా భాస్కర్ షూ పాలిష్ చేస్తున్న శ్రీముఖి, మహేష్ లను ఎంకరేజ్ చేశారు. తరువాత వరుణ్ తో కలసి మిగతా వాళ్ళు కూడా ట్రై చేశారు. చివరకు పునర్నవి టాస్క్ చేయడానికి ఒప్పుకుంది. తరువాత బిగ్ బాస్ టాస్క్ పూర్తి అయ్యింది అని అనౌన్స్ చేశారు. టాస్క్ పూర్తి చేసిన మహేష్, శ్రీముఖి, పునర్నవి లకు లగ్జరీ బడ్జెట్ ఇచ్చారు.

ఈ వారంలో హౌస్‌కి కెప్టెన్ అయ్యేందుకు ‘బరువు లెత్తగలవా జెండా పాతగలవా’.. అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం తమకు ఇష్టమైన వాళ్ల గుర్రం ఎక్కి జెండాలు పాతాలి. ఎవరు ఎక్కువ జెండాలు పాతితే వాళ్లే హౌస్ కెప్టెన్. అయితే ఈ ఆటలో ఆల్ రెడీ హౌస్‌కి కెప్టెన్ అయిన వాళ్లు కాకుండా కొత్త వాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సో.. ఇప్పటి వరకూ కెప్టెన్ కాని వాళ్లు కొత్తగా కెప్టెన్ అయ్యేవాళ్లకు హెల్ప్ చేయాలన్న మాట. అయితే కెప్టెన్ కావడానికి శ్రీముఖి, పునర్నవిలు ఆసక్తి చూపించకపోవడంతో మహేష్, రవి, వితికాలు కెప్టెన్ కోసం పోటీ పడ్డారు. శ్రీముఖిని రవి వీపుపై ఎక్కించుకుంటే.. శివజ్యోతిని మహేష్.. వితికాని వరుణ్ వీపుపై ఎక్కుంచుకుని జెండాలు పాతడానికి ట్రై చేశారు. అయితే ఈ ఆటలో ఎక్కువ జెండాలు పాతిన వితికా.. ఎనిమిదో వారంలో కెప్టెన్‌గా ఎంపికైంది.

దీనితో వితికా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వితికా కు తోడు పునర్నవి కూడా ఎగిరి గెంతులేశారు. తరువాత పునర్నవి, రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు హౌస్ మేట్స్ అందరూ హేయర్ అనే టాస్క్ చేశారు.

Videos