బిహార్ మాజీ ముఖ్యమంత్రి మృతి

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా (82) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢీల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా ఆయన మూడు పర్యాయాలు పనిచేశారు. పీవీ నర్సింహారావు హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు. రాజకీయాల్లోకి రాకముందు జగన్నాథ్‌ మిశ్రా బిహార్‌ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్‌లో ఆచార్యుడిగా పనిచేశారు. అనేక పుస్తకాలను కూడా రాశారు. తొలుత కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ తర్వాత హస్తం పార్టీని వీడి ఎన్సీపీలో చేరారు. తదనంతరం జేడీయూలోనూ పనిచేశారు. పశుగ్రాసం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్నాథ్‌ మిశ్రాను ఇటీవల రాంచీ న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published.