పుదుచ్చేరిలో ఒంటరి బరిలో భాజాపా

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భాజాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మహేశ్‌గిరి తెలిపారు. అధికార ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ పొత్తుపై స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మొత్తం 30 స్థానాలకు గానూ16 నియోజకవర్గాల్లో తొలి విడత అభ్యర్థుల జాబితాను భాజాపా విడుదల చేసింది.

ఈ సందర్భంగా మహేశ్‌ గిరి మాట్లాడుతూ.., భాజపాతో కూటమి విషయంలో ఏఐఎన్‌ఆర్‌సీ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని.. అందుకే ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక మిగిలిన 14మంది అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన ఏఐఎన్‌ఆర్‌సీ.., భాజపాతో కూటమిగా ఏర్పడి విజయం సాధించింది. ఇదిలా ఉండగా పుదుచ్చేరిలో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.