చైనాకు ద‌డ పుట్టిస్తున్న బీజేపీ గెలుపు

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన విజ‌యం చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న‌ది. బీజేపీ విజ‌యం త‌మ‌కు ఏమాత్రం మంచిది కాద‌ని అక్క‌డి అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ అభిప్రాయ‌ప‌డింది. ఇక‌ అంత‌ర్జాతీయ వివాదాల్లో ఇండియా అస‌లు వెన‌క్కి త‌గ్గ‌బోద‌ని చైనా టెన్ష‌న్ ప‌డుతున్న‌ది. ఈ విజ‌యంతో జాతీయంగా, అంత‌ర్జాతీయంగా మోదీ మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆ ప‌త్రిక భావిస్తున్న‌ది. 2019లోనూ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఈ ప‌త్రిక అంచ‌నా వేసింది. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో భార‌త్ వైఖ‌రిలో మోదీ గ‌ణనీయ‌మైన మార్పు తీసుకొచ్చారు. గ‌తంలో భార‌త్ త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎవ‌రినీ నిందించేది కాదు. వివాదాల్లో ఒక నిర్ణ‌యం తీసుకొని దానికి క‌ట్టుబ‌డి ఉండేది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ మ‌ళ్లీ గెలిస్తే.. ఇండియా వ్య‌వ‌హార తీరు మ‌రింత క‌ఠినంగా ఉండ‌నుంది. అదే జ‌రిగితే అంతర్జాతీయ వ్య‌వ‌హారాల్లో భార‌త్ అస‌లు వెన‌క్కి త‌గ్గ‌బోదు అని గ్లోబ‌ల్ టైమ్స్ క‌థ‌నం అభిప్రాయ‌ప‌డింది.

మోదీ తీరును వ‌ర్ణించ‌డానికి ఆ ప‌త్రిక ఒక ఘ‌ట‌న‌ను ఉద‌హ‌రించింది. మోదీ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్‌ను ఇండియా, చైనా స‌రిహ‌ద్దులో చేసుకోవ‌డాన్ని ప్ర‌స్తావించింది. ఇండియా, చైనా స‌రిహ‌ద్దు వివాదానికి ఎలాంటి ప‌రిష్కారం ల‌భించ‌క‌పోయినా.. స‌రిహ‌ద్దులో సైనికుల‌తో మోదీ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ చేసుకొని మోదీ త‌న క‌ఠిన తీరును చెప్ప‌క‌నే చెప్పార‌ని ఆ ప‌త్రిక తెలిపింది. అయినా చైనా, ర‌ష్యాల‌తో స‌త్సంబంధాలు నెరుపుతూ.. మోదీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ్లోబ‌ల్ టైమ్స్ ప్ర‌శంసించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *