షాక్: శ్రీకాకుళంలో నీలి చిత్రాలు తీస్తున్నారా?

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస – పరిసర ప్రాంతాల్లో నీలి చిత్రాలు తీస్తున్నారనే వార్త అక్కడ ప్రజల్లో కలకలం సృష్టిస్తోంది. ఆముదాలవలసలో నీలి చిత్రాల చిత్రీకరణ అనే విషయం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. ఆమదాలవలస పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ప్రత్యక్షంగా ఈ చిత్రాలు చిత్రీకరిస్తున్నారని వారే స్వయంగా సీడీల రూపాల్లో విడుదల చేశారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం ఎవరో బయట వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి చేస్తున్న కార్యక్రమం కాదని – స్థానిక యువకుల పనే అని – వారంతా అక్కడి ప్రజలకు పరిచయస్తులే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాలు చిత్రీకరించిన యువకులే కాదు.. ఆ చిత్రాల్లో పాల్గొన్న మహిళలు కూడా స్థానికులే అనేది తాజా సమాచారం!

ఇప్పటికే వీరు చిత్రీకరించిన నీలి చిత్రాలు స్థానికంగా చాలామంది యువకుల సెల్ ఫోన్లలో హల్ చల్ చేస్తున్నాయట. ఈ విషయాలపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమదాలవలసలో నీలిచిత్రాలు చిత్రీకరణ అంశంపై పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నట్లు మాత్రం తమకు తెలిసిందని వారు చెబుతున్నారట!

కాగా గత రెండు మూడు రోజులుగా ఈ నీలి చిత్రాల చిత్రీకరణ మాటలు అందరి నోటా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం లో ఆముదాలవలస పట్టణంలో సైతం ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగడం నిజంగా హాట్ టాపిక్కే. నీలి చిత్రాలు చూడటమే తప్పు – ఇప్పటికే ఈ విషయంపై కొన్ని పోర్న్ సైట్లపై దేశవ్యాప్తంగా గతంలో నిషేదం విదించడం జరిగింది! ఆలాంటి దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం నిజంగా దారుణమైన సంఘటన అనే చెప్పాలి. ఇలాంటి విషయాల్లో తెలిసో తెలియకో చాలా మంది బలయ్యే ప్రమాదాలు ఉన్నాయి యువతీ యువకులు తమ బంగారు భవిష్యాత్తును ఇలాంటి పనికిమాలిన పనులవల్ల నాశనం చేసుకునే ప్రమాదం పుష్కలంగా ఉందని పలువురు చెబుతున్నారు. ఈ విషయాలపై ఎవరికి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు – మీడియావారికి తెలపాలని పలువురు సూచిస్తున్నారు!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *